English | Telugu

'బాహుబలి ది ఎపిక్'.. మహేష్ కొడుకు గౌతమ్ షాకింగ్ రివ్యూ!

- మొదలైన 'బాహుబలి ది ఎపిక్' సందడి
- ఓవర్సీస్ లో మూవీ చూసిన గౌతమ్
- మాటల్లేవన్న మహేష్ కుమారుడు
- SSMB29 గురించి అడిగితే..?

బాహుబలి సందడి మరోసారి థియేటర్లలో కనిపిస్తోంది. బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ల జోరు కనిపిస్తోంది. తాజాగా 'బాహుబలి ది ఎపిక్'పై మహేష్ బాబు తనయుడు గౌతమ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Baahubali The Epic)

ఓవర్సీస్ లో 'బాహుబలి ది ఎపిక్' సినిమా చూసిన గౌతమ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. "వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ లో 'బాహుబలి ది ఎపిక్' చూడటం అనేది మరిచిపోలేని అనుభవం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసం రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరంలేదు(నవ్వుతూ). సినిమా అద్భుతంగా ఉంది. మన తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ వైడ్ గా ఇంత ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. ఇది నిజంగానే ఎపిక్ మూవీ. ప్రతి సెకన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. దీనిని బిగ్ స్క్రీన్ పై చూడటం ఓ క్రేజీ ఫీలింగ్. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను." అని గౌతమ్ అన్నాడు.

కాగా, మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి నటిస్తున్న ఈ సినిమా గురించి తనకేమీ తెలియదని, తానేమీ చెప్పలేనని సరదాగా చెప్పి తప్పించుకున్నాడు గౌతమ్.

Also Read: 'బాహుబలి ది ఎపిక్' యూఎస్ రివ్యూ..!