English | Telugu

నన్ను బూతులు తిట్టడం వల్లే ‘రాజా సాబ్‌’లాంటి భారీ సినిమా వస్తోంది!

Publish Date:Dec 11, 2025

చిత్ర పరిశ్రమలో కొందరు దర్శకులు కొన్ని రకాల సినిమాలకే పరిమితం అవుతుంటారు. వాళ్లు ఎలాంటి సినిమాతో విజయం సాధించారో ఆ తర్వాత కూడా అదే తరహా సినిమా చెయ్యాలంటూ హీరోలు, నిర్మాతలు కోరుతుంటారు. కానీ, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కృష్ణవంశీ వంటి దర్శకులు మాత్రమే ఏ జోనర్‌ సినిమా అయినా చేసి ప్రేక్షకుల్ని మెప్పించగలరు. కానీ, ఒకే తరహా సినిమాలు చేసే డైరెక్టర్లు తమ ట్రాక్‌ మార్చి మరో జోనర్‌లో సినిమాలు చేసి బాగా దెబ్బ తిన్నవారు కూడా ఉన్నారు.    ఫలానా జోనర్‌లోనే సినిమా చెయ్యగలడు అనే ముద్ర పడిన తర్వాత దాని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. కానీ, డైరెక్టర్‌ మారుతి విషయంలో అది సులభం అయింది. అది కూడా ప్రేక్షకులు, ఇండస్ట్రీలోని కొందరు, మీడియా మారుతిని తిట్టడం వల్ల అతన్నుంచి డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో చేస్తున్న ‘ది రాజా సాబ్‌’ దానికి ఉదాహరణ. తనను తిట్టడం వల్లే ప్రభాస్‌ వంటి టాప్‌ హీరోతో భారీ సినిమా చెయ్యగలుగుతున్నానని ఒక వేదికపై స్వయంగా చెప్పారు మారుతి.    2012లో వచ్చిన ‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా మారారు మారుతి. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. 54 లక్షల్లో నిర్మించిన ఈ సినిమా 18 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత చేసిన ‘బస్‌స్టాప్‌’ చిత్రం కూడా సూపర్‌హిట్‌ అయింది. అయితే ఈ రెండు సినిమాల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, అడల్ట్‌ కంటెంట్‌ ఉండడంతో ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు మారుతి.    డైరెక్టర్‌గా క్లీన్‌ ఇమేజ్‌ తెచ్చుకునే ప్రయత్నంలో తన దగ్గర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జె.ప్రభాకరరెడ్డి డైరెక్షన్‌లో ‘ప్రేమకథా చిత్రమ్‌’ మూవీని నిర్మించారు. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 20 కోట్లు కలెక్ట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే డైరెక్టర్‌గా తన సినిమాటోగ్రాఫర్‌ పేరు వేసినా చేసింది మాత్రం మారుతీయేనని ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. ఎలాంటి బూతులు లేకుండా సినిమా చేసి సూపర్‌హిట్‌ చెయ్యగలనని ఆ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నారు మారుతి.    తను చేసిన మొదటి రెండు సినిమాలను వదిలేస్తే.. తర్వాత చేసిన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు మారుతి. డైరెక్టర్‌గా పది సినిమాలు చేసిన తర్వాత రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్‌’ వంటి పాన్‌ ఇండియా మూవీ చేసే ఛాన్స్‌ వచ్చింది. తను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకుల తిట్లే కారణమని, తన మొదటి రెండు సినిమాలు చూసి కొందరు బూతులు తిట్టారని అన్నారు. దాంతో తనకు పట్టుదల పెరిగి అందరూ మెచ్చే సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ చేసే స్థాయికి వచ్చానని వివరించారు మారుతి. 

HC issues stay on Karthi's Vaa Vaathiyaar release

Publish Date:Dec 11, 2025

Madras High Court has issued stay on Akhanda 2 release before 4th December and the movie producers took time of a week to release it. Now, Vaa Vaathiyaar starring Karthi is similar legal troubles. The Court has issued stay on the film's release as producer KE Gnanavelraja needs to clear pending dues to a financier.  The movie was supposed to release on 5th December, but makers have decided to release it on 12th December, after last minute hurdles. Now, a financier Arjunlal Sunderdas, has gone to court stating that from 2014, Gnanavelraja has not been clearing his amount. Apparently, the producer took Rs.10.35 crores back in the year.  He explained to court that in these 11 years, Gnanavelraja did not pay any interest and the total including everything amounts to Rs.21.78 crores which needs to be settled immediately. The High Court has stated that the film cannot be released without producer clearing the amount.  Even though Gnanavelraja offered to pay Rs.3.75 crores by night and immovable properties documents as assurance, Court did not think such a settlement is probable. Well, Karthi and Krithi Shetty have been promoting the film in Telugu and Tamil states from past one week but looks like cinema will be postponed for sure.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

సాయం చెయ్యడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్న మహానటి సావిత్రి!

Publish Date:Dec 5, 2025

(డిసెంబ‌ర్ 6 మ‌హాన‌టి సావిత్రి జ‌యంతి సంద‌ర్భంగా..) సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో మద్రాస్‌ చేరుకున్న సావిత్రి చిన్న చిన్న పాత్రలు వేస్తూ మహానటిగా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. ఆమె నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలు అందించారు. అంతేకాదు, తోటి నటీనటులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వారికి ఆర్థిక సాయం చేశారు.  అలాంటి మహౌన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సావిత్రి చివరి దశలో ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఆర్థికంగా ఎలాంటి ఒడిడుకులకు లోనయ్యారు అనేది మనకు తెలుసు. తను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఇతరులకు సాయం చేయడానికి వెనుకాడే వారు కాదు. అప్పు చేసైనా తనకు చేతనైనంత సహాయం చేసేవారు. అలాంటి ఓ అరుదైన సంఘటన 1975లో జరిగింది.  నటిగా తను మంచి స్థాయిలో ఉన్నప్పుడు వడ్డీవారిపాలెం గ్రామంలో ఒక పాఠశాలను తన స్వంత ఖర్చులతో నిర్మించారు సావిత్రి. శ్రీమతి సావిత్రి గణేష్‌ పాఠశాల పేరుతో ఆ స్కూల్‌ను 1962లో స్థాపించారు. ఆ తర్వాత పాఠశాలను ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా పేరు మారింది. పాఠశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ వచ్చేది. దానితోనే సిబ్బందికి జీతాలు ఇచ్చేవారు.  1975 ప్రాంతంలో పాఠశాల ఎలా ఉంది అనే విషయం తెలుసుకునేందుకు ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌కు ఫోన్‌ చేశారు సావిత్రి. అతను చెప్పిన మాటలు విని ఆమె షాక్‌ అయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్‌ రాకపోవడం వల్ల 5 నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సావిత్రి మరో మాట మాట్లాడకుండా ఆ కరస్పాండెంట్‌ను మద్రాస్‌ రమ్మని చెప్పారు.  మద్రాస్‌ వెళ్లిన ఆ కరస్పాండెంట్‌కు 1 లక్షా 4 వేల రూపాయల చెక్కును అందించి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించమని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌ విషయం తర్వాత చూసుకుందామని చెప్పి ఆయన్ని పంపించారు. 1975లో లక్ష రూపాయలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం 40 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది.  ఈ డబ్బు చెల్లించే సమయానికి సావిత్రి ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్‌ సిబ్బంది కష్టాలు చూడలేక ఆమె ఆ డబ్బును ఏర్పాటు చేశారు. తను ఏ స్థితిలో ఉన్నాను అనేది కూడా ఆలోచించకుండా దానధర్మాలు చేయడానికి వెనుకాడని సావిత్రి వంటి మహాదాత సినీ పరిశ్రమలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దురంధర్ కి హృతిక్ రోషన్ ఇచ్చిన రివ్యూపై విమర్శలు

Publish Date:Dec 11, 2025

      -హృతిక్ రివ్యూ ఎలా ఉంది  -విమర్శలకి కారణం ఏంటి! -200 కోట్ల క్లబ్ లోకి చేరువలో      బాలీవుడ్ స్టార్ హీరో 'రణవీర్ సింగ్'(Ranveer singh)ఇండియా వ్యాప్తంగా 'దురంధర్'(Dhurandhar)తో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కలెక్షన్స్ ని రాబడుతుందంటే దురంధర్ సాధించిన విజయం ఎంత స్పష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ రా పోలీస్ ఆఫీసర్ గా రణవీర్ పాకిస్థాన్ వెళ్లి అక్కడి తీవ్రవాదులని అంతమొందించే క్యారక్టర్ లో చేసిన పెర్ ఫార్మెన్స్ ని అందరు మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భగా వచ్చే కథ, నేపధ్యాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)ఒక ఇంటర్వ్యూ లో  దురంధర్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.     హృతిక్ మాట్లాడుతు 'దురంధర్' నాకు చాలా బాగా నచ్చింది. మూవీ అంటే ఇలాగే ఉండాలి.  ఇంత గొప్ప కథని సెల్యులాయిడ్ పైకి తీసుకొచ్చినందుకు మేకర్స్ కి నా అభినందనలు.  హృదయాన్ని హత్తుకునేలా తీర్చిదిద్దారు. కాకపోతే రాజకీయపరమైన అంశాలని చూపించిన విధానాన్ని అంగీకరించలేకపోతున్నాను. కానీ ఒక పేక్షకుడిగా సినిమాని ఆస్వాదించడంతో పాటు కథ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో హృతిక్ మాటలపై పలువురు  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మూవీలో కేవలం పాకిస్థాన్ ఉగ్రవాదుల క్రూరత్వాన్ని చూపించడంతో పాటు వాళ్ళు చేసే భయానక దాడుల్ని చూపించారు. ఆ విషయాలని ఎందుకు అంగీకరించలేకపోతున్నారని హృతిక్ ని ప్రశ్నిస్తున్నారు.     also read: దారుణమైన రీతిలో చిన్మయి మార్ఫింగ్ పిక్.. డబ్బులు తీసుకొని చేసింది వీళ్ళే      ఇక దురంధర్ పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా 2000 వ సంవత్సరం నేపథ్యంలో జరిగే కథాంశంతో తెరకెక్కింది. ఇప్పటికే 180 కోట్ల క్లబ్ లోకి చేరి రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది. రణవీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా,వంటి ప్రతిభావంతమైన నటుల పెర్ ఫార్మెన్స్  ఒక రేంజ్ లో ఉంది. ప్రతి ఫేమ్ లోను ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ కట్టిపడేస్తుండగా డిసెంబర్ 5 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.   

Divya Support to Demon Pavan: దివ్వ ఓటు డీమాన్ పవన్‌కి .. అన్నయ్య భరణి పోటు

Publish Date:Dec 11, 2025

బిగ్ బాస్ ఇప్పటికే పదమూడు వారాలు పూర్తయింది. దివ్య నిఖిత మూడో వారం  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి లాజిక్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అది గేమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ భరణితో అన్నయ్య అనే బాండింగ్ తోనే గడిచిపోయింది. ఇక భరణి గారి కుటుంబం గురించి తెలిసిందే కదా.. ఒకవైపు చెల్లి.. ఒకవైపు కూతురు. కూతురు అయిన తనూజతో భరణి క్లోజ్ గా ఉంటే దివ్య అసలు ఒప్పుకోదు. భరణిని కమాండ్ చేసేది.. ఆ విషయం భరణి తనకి ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళతో వీళ్లతో చెప్తుండేవాడు. భరణికి బాలేకపోతే దగ్గరుండి మరి బాగోగులు చూసుకునేది. ఫ్యామిలీ వీక్ లో భరణి కూతురు వచ్చి.. మీరు డాడీపై కమాండింగ్ తగ్గించండి అని చెప్పింది. తనూజతో భరణి కూతురు క్లోజ్ గా పాజిటివ్ గా మాట్లాడతుంది కానీ దివ్యతో అంతగా మాట్లాడదు. దివ్య ఎలిమినేట్ అయినప్పుడు భరణి చాలా ఎమోషనల్ అవుతాడు. నాకు ఈ హౌస్ ద్వారా మంచి అన్నయ్య దొరికాడు అని దివ్య స్టేజ్ పైన చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో కూడా భరణి గారి కూతురు నాతో మాట్లాడలేదు.. నేను హర్ట్ అయ్యానని దివ్య చెప్పింది. అయితే దివ్య బయటకు వచ్చి రెండు వారాలు పూర్తయింది. అయితే హౌస్ లో  భరణితో పాటు హౌస్ మేట్స్ ఆట చూసినట్లుంది. తన గురించి ఎవరు ఏం మాట్లాడారో అన్నీ మనసులో పెట్టుకుంది. అందుకే హౌస్ నుండి బయటకు వచ్చాక భరణికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ తాజాగా డీమాన్ కి ఓటు వేసినట్లు స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హౌస్ లో ఉన్నప్పుడు భరణిని అన్నయ్య లాగా ఫీల్ అయినా చెప్పిన దివ్య తనకి సపోర్ట్ గా ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడంతో అందరికి అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యకి కాకుండా ఫ్రెండ్ కి సపోర్ట్ చెయ్యడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే హౌస్ లో ఉన్నవారిలో జెన్యున్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది డీమాన్ పవన్ అనేది అందరికి తెలిసిందే. హౌస్ లో ఉన్నవారిలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.

వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న!

Publish Date:Dec 9, 2025

  ఇంతవరకు డ్యూయల్ రోల్ చేయని మహేష్! ఇప్పుడు వారణాసిలో ఏకంగా ఐదు పాత్రల్లో సర్ ప్రైజ్!   హీరోగా రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో మహేష్ బాబు(Mahesh Babu) డ్యూయల్ రోల్ చేయలేదంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. 'నాని' సినిమాలో మాత్రమే కాసేపు డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఫుల్ లెంగ్త్ లో ఇంతవరకు నటించలేదు. అలాంటి మహేష్ బాబు.. ఇప్పుడు రెండు పాత్రల్లో కాదు, ఏకంగా ఐదు పాత్రల్లో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో 'వారణాసి'(Varanasi) అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.    'వారణాసి'లో మహేష్ రుద్ర అనే పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన లుక్ ఆకట్టుకుంది. అలాగే ఇందులో శ్రీరాముడిగా కూడా మహేష్ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలతో పాటు.. మరో మూడు పాత్రలలో మహేష్ కనువిందు చేయనున్నాడట. అందులో ఒకటి శివుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. మిగతా రెండు పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. ఒక్కో పాత్రలో మహేష్ కనిపించే తీరు సర్ ప్రైజ్ చేయడం ఖాయం అంటున్నారు.   Also Read: ఆ హీరోయిన్ తో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రెండో పెళ్లి..!   ఈ జనరేషన్ లో ట్రిపుల్ రోల్ చేయడమే అరుదు అయిపోయింది. అలాంటిది మహేష్ ఏకంగా ఐదు పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. పైగా దర్శకుడు రాజమౌళి కాబట్టి.. ప్రతి పాత్రని ఎంత గొప్పగా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.    'వారణాసి'లో మహేష్ ఐదు పాత్రలు పోషిస్తున్నాడనే వార్త నిజమైతే మాత్రం.. ఇది అభిమానులకు బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.  

Is Mahesh Babu playing five roles in Varanasi?

Publish Date:Dec 10, 2025

Superstar Mahesh Babu and legendary director SS Rajamouli are coming together for the first time with Vaaranaasi. The movie announcement video has created global sensation with stunning VFX and high-end concept. The movie team have been maintaining a tight lip about shooting updates, post the release of the video.  Now, the rumors about Mahesh Babu playing five roles are going around across the internet. It is stated that along with Lord Rama, Rudra, he is playing roles like Lord Shiva, A traveller King of Ancient India and another hidden role. They are also staring that the movie is being divided into two parts.  Rumors are also aplenty that Mahesh is taking Rs.50 crore salary per annum for the project till the movie shoot is over. He might be looking at a huge paycheck of Rs.150-175 crores as his remuneration for the film. Rajamouli is said to be planning even bigger schedule from January till March 2026, in RFC.  Well, some close sources to the team have rubbished five roles for Mahesh rumors. They stated that he might be appearing in different get-ups but only two roles as Rama and Rudra. And they did not confirm about MB's salary or two parts rumors. Priyanka Chopra and Prithviraj Sukumaran are playing other leading roles.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

ప్రేమంటే

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969

12A Railway Colony

Publish Date:Dec 31, 1969

Premante

Publish Date:Dec 31, 1969