English | Telugu

Samantha : డోస్ పెంచిన సమంత.. బజార్ లో రెచ్చిపోయింది!

తెలుగునాట స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో సమంత ఒకరు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె కొంతకాలంగా సినిమాలు తగ్గించింది. ఈ ఏడాది విడుదలైన 'శాకుంతలం', 'ఖుషి' బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. హెల్త్ పూర్తిగా సెట్ అయ్యేవరకు సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సినిమాలు చేయనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు మారుమోగిపోతోంది. ఆమె లేటెస్ట్ హాట్ ఫొటోలు చూసి అభిమానులతో పాటు అందరూ షాక్ అవుతున్నారు.

సమంత తాజాగా 'బజార్ ఇండియా' అనే మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ చేసింది. అయితే ఆ ఫొటోలలో సమంతను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. స్విమ్ సూట్ ని తలపించే బ్లాక్ డ్రెస్ లో సమంతని చూసి ఆమె అభిమానులే షాక్ అవుతున్నారు. అలాగే ఓ ఫొటోలో బ్యాక్ చూపిస్తూ, మరో ఫొటోలో షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి.. సమంత హాట్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి.

నాగచైతన్యతో విడాకులు, ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో మొన్నటివరకు సమంతపై అందరిలో సానుభూతి ఉండేది. అయితే ఇప్పుడు ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. మొన్నటివరకు అనారోగ్యం, ధ్యానం వంటి కబుర్లు చెప్పి.. ఇప్పుడు శరీర భాగాలను చూపిస్తూ ఇంతలా గ్లామర్ షో చేయడం అవసరమా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమంత లేటెస్ట్ ఫొటోల పట్ల ఫ్యాన్స్ సైతం డిజప్పాయింట్ అవుతున్నారు. మొన్నటివరకు ఆమెని సపోర్ట్ చేసినవాళ్ళే.. ఈస్థాయి అందాల ఆరబోత అవసరమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్, హాలీవుడ్ పైన దృష్టి పెడుతుందని.. అందుకే ఈ రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.