English | Telugu
అనుష్క తప్పిపోయింది.. వెతికి తెస్తే.. 50,000 క్యాష్!
Updated : Nov 10, 2023
‘అనుష్క మిస్ అయ్యింది. ఆమెను వెతకడంలో సాయం చెయ్యండి’ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్త అందరినీ కలవరపరిచింది. ఇంతకీ ఈ పోస్ట్ పెట్టింది ఎవరో కాదు, సన్నీ లియోన్. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అయిపోయింది. ఆ పోస్ట్‌ను విపరీతంగా షేర్ చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తన దగ్గర పనిచేస్తున్న పనిమనిషి కుమార్తె తొమ్మిదేళ్ళ అనుష్క జోగేశ్వరి వెస్ట్ బెహ్రామ్ బాగ్‌లో నవంబర్ 8న తప్పిపోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇది చూసిన సన్నీ లియోన్ తట్టుకోలేకపోయింది. ‘అనుష్క తల్లిదండ్రుల వేదన చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఆమెను వెతికి తీసుకొచ్చిన వారికి రూ.50,000 నగదు బహుమతి ఇస్తాను’ అని తన పోస్ట్‌లో తెలియజేసింది. అంతేకాదు, తన పోస్ట్‌ను ముంబయి పోలీసులకు కూడా ట్యాగ్ చేసింది. బాలీవుడ్‌కి చెందిన కొందరు సెలబ్రిటీలు, నెటిజన్లు సన్నీ పోస్ట్‌ను వైరల్ చేశారు.
తాజాగా సన్నీ లియోన్ మరో పోస్ట్ పెట్టింది ‘అనుష్క దొరికింది’ అంటూ. ‘అనుష్కను వెతకడంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మన ప్రార్థనలకు సమాధానం దొరికింది. ఆ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ముంబయి పోలీసులకు థ్యాంక్యూ. 24 గంటల్లోనే అనుష్క తిరిగి మా వద్దకు చేరింది. ఆమె కోసం నేను పెట్టిన పోస్ట్‌ను షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు’ అని తన పోస్ట్‌లో తెలియజేసింది సన్నీ. తన ఇంట్లో పనిచేసే పనిమనిషి బిడ్డ తప్పి పోతే తల్లడిల్లిపోయిన సన్నీ.. ఆమెను వెతికి పట్టుకోవడానికి పడిన తపన చూసి నెటిజన్లు సన్నీని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆమె మంచి మనసును కొనియాడుతున్నారు.