English | Telugu

చిన్న పిల్లల కోసం ఇన్ఫోసిస్ అధినేత కథలు 

సృష్టి ఆరంభం నుంచి పంచభూతాలు ఎలా అయితే సృష్టితో కలిసి ప్రయాణం చేస్తున్నాయో కథ కూడా అలాగే సృష్టితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంది. కథకి ఎన్నో రూపాలు. అన్ని రూపాల లక్ష్యం కథనే. ప్రతి ఒక్కరు కథ ని విన్నవాళ్ళే. చిన్నప్పుడు కథ లని వినడం దగ్గరనుంచే ఎవరైనా తమ తెలివిని మెరుగుపర్చుకుంటారు. ఒకప్పుడు మన తాత, నాయనమ్మ, అమ్మమ్మలు మనల్ని తమ ఒళ్ళో కూర్చోపెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు. ప్రస్తుత కాలంలో ఫోన్ లోనే కథలు వస్తున్నాయి. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి కూడా చిన్న పిల్లలకి కథలు చెప్పడానికి ఒక ఛానల్ ని ప్రారంభించారు .
స్టోరీ టైం విత్ సుధా అమ్మ పేరిట సుధామూర్తి గారు పిల్లల కోసం ఒక యానిమేటెడ్ సిరీస్ ని తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో చిన్న పిల్లలకి సంబంధించిన బోలెడన్ని కథలని స్వయంగా సుధా మూర్తి గారే పిల్లలకి చెప్తున్నారు .సుధామూర్తి గారి రూపంతో ఉన్న యానిమేషన్ బామ్మ చిన్నపిల్లలకి బోలెడన్ని కథల్ని చెప్తుంది.సుధా మూర్తి గారు ఇంతకుముందే చిన్న పిల్లల కోసం కథలకి సంబంధించిన బోలెడన్ని పుస్తకాల్ని తీసుకొచ్చింది.
ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి యానిమేటెడ్ సిరీస్ ద్వారా చిన్న పిల్లల్ని భావిభారత పౌరులుగా తీర్చితిదిద్దాలని నిర్ణయించుకున్నారు. 52 సిరీస్ లతో కూడిన సుధామూర్తి గారి కథల్ని చాల మంది పిల్లలు చూస్తున్నారు. మూర్తి యు ట్యూబ్ మీడియా ఛానల్ లో తెలుగు, తమిళ,మలయాళ ,కన్నడ,మరాఠీ ,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సుధా మూర్తి కథలు ప్రసారమవుతున్నాయి.