English | Telugu
బ్రేకుల్లేని బుల్డోజర్ లా దూసుకుపోతున్న సలార్
Updated : Dec 31, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'సలార్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలైంది. భారీ వసూళ్లతో మొదటి పూర్తి చేసుకున్న ఈ సినిమా, రెండో వారంలోనూ అదే జోరు చూపిస్తోంది.
తొమ్మిది రోజుల్లో నైజాంలో రూ.64.47 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.18.16 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.50.22 కోట్ల షేర్ రాబట్టిన సలార్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.132.85 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక రూ.20.40 కోట్ల షేర్, తమిళనాడు రూ.10.20 కోట్ల షేర్, కేరళ రూ.6.10 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా రూ.57.80 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.57.25 కోట్ల షేర్ కలిపి.. తొమ్మిది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.284.60 కోట్ల షేర్ రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సలార్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.61 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తొమ్మిదో రోజైన శనివారం వరల్డ్ వైడ్ గా రూ.10.05 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. 10వ రోజు ఆదివారం, 11వ రోజు న్యూ ఇయర్ కావడంతో.. రేపటికి రూ.300 కోట్ల షేర్ క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది. ఇదే జోరు కొనసాగితే సలార్ మూవీ త్వరలోనే బ్రేక్ ఈవెన్ కి చేరువయ్యే అవకాశముంది.
సలార్ మూవీ 9 రోజుల వసూళ్లు:
నైజాం: రూ.64.47 కోట్ల షేర్
సీడెడ్: రూ.18.16 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.50.22 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.132.85 కోట్ల షేర్
కర్ణాటక: రూ.20.40 కోట్ల షేర్
తమిళనాడు: రూ.10.20 కోట్ల షేర్
కేరళ: రూ.6.10 కోట్ల షేర్
హిందీ+రెస్టాఫ్ ఇండియా: రూ.57.80 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.57.25 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ.284.60 కోట్ల షేర్