English | Telugu
'డెవిల్' కలెక్షన్స్.. నష్టాలు తప్పేలా లేవు!
Updated : Dec 31, 2023
విభిన్న చిత్రాలతో అలరించే నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా 'డెవిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 29న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్టుగానే ఓ మాదిరిగానే ఉన్నాయి. రెండు రోజుల్లో ఈ సినిమా 20 శాతం మాత్రమే రికవర్ చేసింది.
రెండు రోజుల్లో నైజాంలో రూ.1.31 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.58 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.29 కోట్ల షేర్ రాబట్టిన డెవిల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.3.18 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.35 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.60 లక్షల షేర్ కలిపి.. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.4.13 కోట్ల షేర్ రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.20.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన డెవిల్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.16 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ సినిమా నష్టాల నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం.
డెవిల్ రెండు రోజుల వసూళ్లు:
నైజాం: రూ.1.31 కోట్ల షేర్
సీడెడ్: రూ.58 లక్షల షేర్
ఆంధ్రా: రూ.1.29 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.3.18 కోట్ల షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.35 లక్షల షేర్
ఓవర్సీస్: రూ.60 లక్షల షేర్
ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల వసూళ్లు: రూ.4.13 కోట్ల షేర్