English | Telugu

The Paradise: బిగ్ సర్ ప్రైజ్.. ఊర మాస్ అవతార్ లో సంపూర్ణేష్ బాబు..!

'దసరా' తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్, 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట వంటి సినిమాలతో కామెడీ హీరోగా మంచి గుర్తింపు పొందాడు సంపూర్ణేష్ బాబు. ఇతర హీరోల సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తాడు. అయితే సంపూర్ణేష్ పేరు వింటే.. మొదట గుర్తుకొచ్చేది కామెడీనే. అలాంటి సంపూర్ణేష్.. ఇప్పుడు 'ప్యారడైజ్' కోసం మాస్ అవతారమెత్తాడు. (Sampoornesh Babu as Biryani)

'ది ప్యారడైజ్'లో నాని జడల్ అనే పాత్ర పోషిస్తుండగా, అతని స్నేహితుడు బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ నటిస్తున్నాడు. తాజాగా బిర్యానీ రోల్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఒంటి నిండా నెత్తుటి మరకలతో.. భుజాన గొడ్డలి వేసుకొని.. బీడీ తాగుతూ నిల్చొని ఉన్న సంపూర్ణేష్ లుక్ అదిరిపోయింది. ఈసారి తనలోని మాస్ యాంగిల్ ని చూపించబోతున్నాడని పోస్టర్ తో అర్థమవుతోంది.

Also Read: BMW టీజర్.. భార్యకు తెలియకుండా స్పెయిన్ లో భర్త రాసలీలలు!

'ది ప్యారడైజ్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా నెవర్ బిఫోర్ లుక్ లో నాని కనిపించిన తీరు సర్ ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు సంపూర్ణేష్ బాబు లుక్ చూసిన తర్వాత.. ఇందులో మరిన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నామని అనిపిస్తోంది.