English | Telugu
నాని సినిమాలో హాలీవుడ్ అగ్ర హీరో!
Updated : Nov 1, 2025
-ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు
-వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని
-నాని కోసం ర్యాన్ రెనాల్డ్స్!
-అంతర్జాతీయ ప్రమాణాలు
వరుస విజయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే 'నాచురల్ స్టార్ నాని'(Nani)అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా సినిమాకి విభిన్నమైన జోనర్స్ ని ఎంచుకుంటు అభిమానులని, ప్రేక్షకులని తనదైన నటనతో మెస్మరైజ్ చేస్తు వస్తున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ ది థర్డ్ కేస్ వంటి వరుస చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు 'ది ప్యారడైజ్' అనే మరో విభిన్నమైన మూవీ చేస్తున్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ తో ఏ విషయం అర్ధమవుతుంది.
అందుకు తగ్గట్టే ప్యారడైజ్ లో ప్రముఖ హాలీవుడ్ నటుడు 'ర్యాన్ రెనాల్డ్స్'(Ryan Reynolds)చెయ్యబోతునట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. కథకి సంబంధించిన ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ రెనాల్డ్స్ ని సంప్రదించారని, అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారకంగా ప్రకటిస్తారనే మాటలు కూడా వినపడుతున్నాయి. దీంతో ప్యారడైజ్ ఏ స్థాయిలో తెరకెక్కబోతుందనే విషయం అర్ధమవుతుంది. ర్యాన్ రెనాల్డ్స్ సుదీర్ఘ కాలం నుంచి హాలీవుడ్ లో నెంబర్ ఆఫ్ చిత్రాలు చేస్తు ప్రపంచ సినీ ప్రేమికులని అలరిస్తు వస్తున్నాడు. గత సంవత్సరం జులైలో 'డెడ్ పూల్'(Deadfool)అనే చిత్రంతో థియేటర్స్ లో సందడి చేసాడు. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజై అభిమానులని అలరించింది.
Also Read: బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!
వేడ్ విల్సన్, డెడ్ ఫూల్ గా మెస్మరైజ్ చేసాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odhela)సిల్వర్ స్క్రీన్ పై ఒక సరికొత్త ప్రపంచాన్నిసృష్టించబోతున్నాడు. టీజర్ తో ఈ విషయం స్పష్టమవుతుంది. మరి రెనాల్డ్స్ వంటి లెజండ్రీ యాక్టర్ ప్యారడైజ్ లో చేయడం ఖాయమైతే మూవీ లవర్స్ కి ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఇక ప్యారడైజ్ మూవీ భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వంటి లాంగ్వేజెస్ లో కూడా విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి తో పాటు నాని కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2026 మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.