English | Telugu

దీపికపై ‘కల్కి’ టీమ్‌ కక్ష సాధింపు.. అది చిన్నపిల్లల చర్య అంటూ విమర్శలు!

- కల్కి2లో మరో పాన్ ఇండియా హీరోయిన్

- వైజయంతీ మూవీస్‌పై విమర్శలు

- కల్కి2 పనులు మొదలయ్యాయి

సినీ పరిశ్రమలో కొందరు నటీనటులను ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి వారిలో దీపికా పదుకొనే ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమధ్య కల్కి2 చిత్రానికి సంబంధించిన వివాదం తెలిసిందే. పారితోషికం పెంచాలని, పని గంటలు తగ్గించాలని దీపిక చేసిన డిమాండ్స్‌ వల్ల వివాదం మొదలైంది. దీంతో ఆమె కల్కి2 చిత్రం నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘కల్కి’ చిత్రంలోని ఎండ్‌ టైటిల్స్‌లో దీపిక పేరును తొలగించారన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కల్కి టీమ్‌ ఇలా చేయడం సరికాదని నెటిజన్లు, అభిమానులు విమర్శిస్తు న్నారు. అతి పెద్ద సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఇది చిన్న పిల్లల చర్యలా ఉందని విమర్శిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ చర్చ జరుగుతుండగానే మరోసారి ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న కల్కి చిత్రాన్ని కొందరు ప్రముఖులు చూశారు. అయితే ఎండ్‌ టైటిల్స్‌లో దీపిక పేరు యధాతథంగా ఉందని గుర్తించారు.

Also Read:బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!

దీన్నిబట్టి మొదట ఆమె పేరును తొలగించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చను చూసిన తర్వాత మళ్ళీ యాడ్‌ చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక పెద్ద నిర్మాణ సంస్థ వ్యవహరిం చాల్సిన తీరు ఇది కాదని కామెంట్స్‌ పెడుతున్నారు. కల్కి నుంచి తప్పుకున్న దీపిక స్పిరిట్‌ చిత్రం నుంచి కూడా వైదొలగినట్టు తెలుస్తోంది. తన కుమార్తె కోసం తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు దీపిక చెబుతోంది. ప్రస్తుతం షారూక్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న కింగ్‌ చిత్రంలోనూ, అల్లు అర్జున్‌ హీరోగా నటించే ఓ సినిమాలో దీపిక నటించనుంది.

Also Read:https: మాస్ జాతర మూవీ రివ్యూ

ఇక ప్రభాస్‌ చేస్తున్న రాజాసాబ్‌, ఫౌజీ చిత్రాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. త్వరలోనే సందీప్‌రెడ్డి వంగా స్పిరిట్‌ స్టార్ట్‌ కాబోతోంది. ఆ తర్వాత కల్కి2 సినిమా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. దీపిక స్థానంలో మరో హీరోయిన్‌ కోసం అన్వేషిస్తున్నారు మేకర్స్‌. పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అయిన హీరోయిన్‌కే ఈ సినిమాలో ఛాన్స్‌ ఇస్తారని సమాచారం. అయితే ఎవరిని తీసుకో బోతున్నారు అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పట్లో దానికి సంబంధించిన ఏ సమాచారం బయటికి రాకపోవచ్చు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.