English | Telugu

ఘనంగా జరిగిన అల్లు శిరీష్, నైనికా ఎంగేజ్మెంట్.. మెగా హైలెట్స్ ఇవే 

-అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
-నైనికా ఎవరు
-మెగా ఫ్యామిలీ సందడి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)సోదరుడు ప్రముఖ హీరో 'అల్లు శిరీష్'(Allu Sirish)కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నానని తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు నైనికా అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నైనికా(Nayanika)ఎవరనే చర్చ అభిమానులతో పాటు నెటిజన్స్ లో జరిగింది.


రీసెంట్ గా అల్లు శిరీష్,నైనికా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. శిరీష్ ఇంట్లో ఈ వేడుక జరగగా, ఇరు వైపుల పెద్దల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. నిశ్చితార్థ వేడుకలో అల్లు కుటుంబంతోపాటు మెగాస్టార్ చిరంజీవి(Chiramjeevi),నాగబాబు, రామ్ చరణ్(Ram Charan)వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. నిజానికి ఈ కార్యక్రమం అవుట్ డోర్ లో జరగాల్సింది. ఈ విషయంపై నిన్న శిరీష్ ఎక్స్ వేదికగా స్పందిస్తు చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను. కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్’ అంటూ శిరీష్ ట్వీట్ చేసాడు.

Also read:నాని సినిమాలో హాలీవుడ్ అగ్ర హీరో!

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.