English | Telugu
మహేష్‌బాబు మన్నిస్తాడా?
Updated : Jul 6, 2013
మహేష్‌బాబుకు మొదటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడుగా మాత్రమే కాదు.. మహేష్‌బాబుతో ముచ్చటగా మూడు సినిమాలు రూపొందించిన ఏకైక దర్శకుడిగానూ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మంచి విజయం నమోదు చేసిన "ఒక్కడు" అనంతరం మహేష్‌బాబు_గుణశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన "అర్జున్" యావరేజ్ చిత్రంగా నిలవగా.. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన "సైనికుడు" సూపర్ ఫ్లాప్ అయ్యింది.
ఇప్పటివరకు మహేష్‌బాబు చేసిన సినిమాలన్నిట్లో అతిపెద్ద ఫ్లాప్ ఏమిటంటె.. "సైనికుడు". అందులోనూ "పోకిరి" వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తమ హీరోకు "సైనికుడు" వంటి సూపర్‌ఫ్లాప్‌నిచ్చిన గుణశేఖర్ అంటె ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్రుమంటారు. అలాంటి గుణశేఖర్ తను తాజాగా అనుష్కతో తీస్తున్న "రుద్రమదేవి" చిత్రంలో మహేష్‌బాబుతో ఓ స్పెషల్ రోల్ చేయించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.
పెద్ద మనసు చేసుకొని ఒకవేళ మహేష్‌బాబు అంగీకరించినా.. ఆయన ఫ్యాన్స్ అంగీకరిస్తారా? అది కూడా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో.. అది కూడా గుణశేఖర్ దర్శకత్వంలో..???