English | Telugu
"అనామిక"లో "చండీ" భామ
Updated : Jul 6, 2013
హిందీలో విద్యాబాలన్ నటించిన "కహాని" చిత్రాన్ని తెలుగులో "అనామిక" పేరుతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో తను కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలిపింది హీరోయిన్ ప్రియమణి. ముందుగా ఈ పాత్ర గురించి శేఖర్ చెప్పగానే... ఏమి ఆలోచించకుండా వెంటనే ఓకే చేసేసిందట. త్వరలోనే ప్రియమణి కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది. ప్రస్తుతం ప్రియమణి "చండీ" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది.