English | Telugu
నిర్మాతగా రేణు దేశాయ్ !!
Updated : Jun 18, 2013
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సతీమణి రేణు దేశాయ్ నిర్మాతగా మారనున్నారు. త్వరలో ఆమె ఓ మరాఠీ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్వప్నిల్ జోషి_ముక్తా భార్వె జంటగా నటించనున్న ఈ చిత్రానికి "మంగళాష్‌టేక్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో.. ఆమె మరాఠీ చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరాఠీ చిత్రాలపై బాలీవుడ్ ప్రభావం కూడా పుష్కలంగా ఉంటుంది గనుక.. ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
అయితే.. ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. ఈ కథ కాస్త అటు ఇటుగా పవన్‌కళ్యాణ్_రేణుదేశాయ్‌ల ప్రస్తుత స్థితిని ప్రతిబింబించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు!