English | Telugu
కోట్లివ్వడానికి క్యూ కడుతున్నారు !
Updated : Jul 5, 2013
"మిరపకాయ్" అనంతరం రవితేజ నటించిన చిత్రాలు వరుసగా ఆరు అపజయం పాలవ్వడంతో.. ఇక రవితేజ పనైపోయినట్లేననే అంచనాలు మొదలయ్యాయి. "బలుపు" కూడా పరాజయం పాలైతే.. పరిస్థితి సహజంగానే అలాగే ఉండేది. కానీ అనూహ్యంగా "బలుపు" మంచి విజయం నమోదు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ నేపధ్యంలో రవితేజతో సినిమాలు తీసేందుకు పలువురు నిర్మాతలు మళ్లీ క్యూ కడుతున్నారు. అయిదారు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు తయారైపోతున్నారు. అయితే, రవితేజ మాత్రం తన తదుపరి చిత్రం విషయమై ఆచితూచి అడుగు వేయాలని ఆలోచిస్తున్నాడని సమాచారం అందుతోంది. అందుకే స్ట్రెయిట్ చిత్రానికి బదులుగా వేరే భాషలో హిట్టయిన సినిమాకు రీమేక్‌లో నటించాలని చూస్తున్నాడని తెలుస్తోంది. రవితేజ నుంచి ఈమేరకు సంకేతాలు అందుకున్న రవితేజ ఫ్రెండ్స్, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇటీవల విడుదలై విజయం సాధించిన చిత్రాల గురించి వాకబు చేస్తున్నారని తెలుస్తోంది!