English | Telugu
నిరాశలో తల్లీకూతుళ్ళు
Updated : Jul 4, 2013
"జోష్" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కార్తీకకు తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో... తమిళంలో వచ్చిన అవకాశాలను అందుకుంటుంది. అయితే తాజాగా భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన "అన్నకోడి" చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కార్తీక తల్లి రాధ "ముదల్ మరియాదై" అనే చిత్రంలో జాకెట్ వేసుకోకుండా నటించింది. ఆ చిత్రం జనాలకు నచ్చడంతో ఘన విజయం సాధించింది. కానీ ఈ "అన్నకోడి" చిత్రంలో కూడా కార్తీక జాకెట్ వేసుకోకుండా నటించింది. ఆ సినిమా వలె ఈ "అన్నకోడి" చిత్రం హిట్టు అవుతుందనుకున్న తల్లీకూతుళ్ళకు నిరాశే మిగిలింది. దీంతో మరోసారి ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని ఈ తల్లీకూతుళ్ళు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.