English | Telugu
సెప్టెంబర్ 6న తూఫాన్ రాక
Updated : Jul 4, 2013
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "తూఫాన్". ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు. హిందీలో "జంజీర్" పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. అపూర్వ లాకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమిత్ మెహ్ర, పునీత్, సుమీత్ మెహ్రలు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ఆడియోను జూలై 5న విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ "ఎవడు" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కూడా త్వరలోనే విడుదల కానుంది.