English | Telugu
చిరంజీవి కొడుకు కాబట్టే చరణ్ ఇలా ఉన్నాడు.. రామ్ సంచలన వ్యాఖ్యలు!
Updated : Oct 21, 2025
నెపోటిజం అంటూ కొందరు స్టార్స్ మీద కామెంట్స్ చేయడం చూస్తుంటాం. స్టార్ కి వారసుడు కాబట్టే, స్టార్ అయ్యాడు అంటూ హీరోలని తేలికగా తీసి పారేస్తుంటారు. అయితే వారసత్వం అనేది గ్రాండ్ లాంచ్ కి ఉపయోగపడుతుంది అంతే. ప్రతిభనో, ఏదైనా ప్రత్యేకతనో లేకుండా ఎవరూ స్టార్ కాలేరు. పైగా, ఒక వారసుడు స్టార్ అవ్వడం వెనుక ఎంతో ఒత్తిడిని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. తాజాగా ఈ విషయంలో రామ్ చరణ్ పై రామ్ పోతినేని కీలక వ్యాఖ్యలు చేశాడు. (Ram Charan)
జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకి రామ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక విషయంలో చరణ్ ని చూసి బాధ కలిగిందని అన్నాడు. రామ్ నటించిన మొదటి చిత్రం 'దేవదాస్' పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై, ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేవదాస్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యాక స్పెషల్ స్క్రీనింగ్ కి చిరంజీవి, రామ్ చరణ్ వచ్చారు. ఆ సమయంలో చరణ్ ని చూసి.. తనకి కూడా చిరంజీవి లాంటి స్టార్ ఫాదర్ ఉంటే బాగుండేది, మంచి లాంచింగ్ ఉండేదని రామ్ అనుకున్నాడట. కానీ, ఆ తర్వాత చరణ్ పై ఉన్న ప్రెజర్ చూసి బాధపడ్డానని రామ్ తెలిపాడు. తండ్రి లెగసీని కొనసాగించడానికి చరణ్ ఎంత కష్టపడాడో, ఎంత ఒత్తిడిని అనుభవించాడో.. కొద్దిమందికి మాత్రమే అర్థమవుతుందని రామ్ అభిప్రాయపడ్డాడు. (Ram Pothineni)
చిరంజీవి, చరణ్ గురించి రామ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి కొడుకు కాబట్టే చరణ్ స్టార్ అయ్యాడని కొందరు తేలికగా తీసిపారేస్తుంటారు. అయితే స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేని హీరో కంటే.. స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోనే ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఒత్తిడిని అనుభవించాలని.. రామ్ ఒక హీరోగా, ఇండస్ట్రీని దగ్గర నుండి చూసినవాడిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రామ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులు రామ్ ని ప్రశంసిస్తున్నారు. నెపోటిజం అంటూ నోరు జారకుండా, నిజాలు మాట్లాడాడు అంటూ మెచ్చుకుంటున్నారు.
కాగా, రామ్ త్వరలో 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నవంబర్ 28న విడుదల కానున్న ఈ సినిమాలో.. రామ్ ఒక స్టార్ హీరోకి అభిమానిగా కనిపిస్తుండటం విశేషం.