English | Telugu

‘ఫౌజీ’ అప్‌డేట్‌ వచ్చేసింది.. ఒంటరిగా పోరుకు సిద్ధమైన యోధుడు!

ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమైన రోజు నుంచి రకరకాల అప్‌టేడ్స్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన రకరకాల ఊహాగానాలు చేస్తూ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రెండు పండగలు వరసగా వచ్చాయి. అక్టోబర్‌ 20న దీపావళి పండగను దేశ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌ 23న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజును ఆయన అభిమానులు ఒక పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని ‘ఫౌజీ’ యూనిట్‌.. అందరూ షాక్‌ అయ్యేలా ఒక అప్‌డేట్‌తో వచ్చింది.

ఈ సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను అఫీషియల్‌గా ఫిక్స్‌ చేయకపోయినా ఈ ప్రాజెక్ట్‌ను అదే పేరుతో చలామణి చేస్తున్నారు ప్రేక్షకులు, అభిమానులు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇది యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా అనే విషయాన్ని ఈ పోస్టర్‌ తెలియజేస్తోంది. ఎయిమ్‌ చేసి ఉన్న గన్స్‌ వెనుక ప్రభాస్‌ కనిపిస్తున్నాడు. అతని ఫేస్‌ కనిపించకపోయినా, సినిమాలో అతని శక్తి సామర్థ్యాలను తెలిపే ఒక క్యాప్షన్‌ని మాత్రం వదిలారు. ‘ఎ బెటాలియన్‌ హూ స్టాండ్స్‌ ఎలోన్‌’... ఒంటరిగా నిలబడినప్పటికీ అతను ఓ బెటాలియన్‌ అనే అర్థం వచ్చేలా ఉన్న క్యాప్షన్‌ చూస్తుంటే.. ప్రభాస్‌ని ఈ సినిమాలో ఎంత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారో తెలుస్తుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మిగతా అప్‌డేట్స్‌ అక్టోబర్‌ 22 నుంచి మొదలవుతాయనే విషయాన్ని కూడా ఈ పోస్టర్‌లో తెలిపారు.

ఈ సినిమాతో ప్రభాస్‌ రేంజ్‌ను మరింత పెంచేలా అతని క్యారెక్టర్‌ని డిజైన్‌ చేసినట్టు పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ విషయంలో దర్శకుడు హను రాఘవపూడి చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఇమాన్‌ వి. ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రిలీజ్‌ అయిన పోస్టర్‌, ఆ క్యాప్షన్‌ చూస్తుంటే ఈ సినిమాకి ‘ఫౌజీ’నే టైటిల్‌గా కన్‌ఫర్మ్‌ చేస్తారనిపిస్తోంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.