English | Telugu

Varanasi: శ్రీరాముడిగా మహేష్ బాబు.. ఆ 25 నిమిషాలు ఎప్పటికీ మర్చిపోలేరు!

వారణాసిపై రోజురోజుకి పెరిగిపోతున్న అంచనాలు
శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న మహేష్
ఆ 25 నిమిషాలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరన్న రాజమౌళి

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'వారణాసి'(Varanasi). కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్, 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వారణాసి'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మహేష్, రాజమౌళి ఈ చిత్ర వివరాలను పంచుకొని అంచనాలను మరింత పెంచేశారు.

'వారణాసి' మూవీ టీమ్ తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి మహేష్ మాట్లాడుతూ.. "15 ఏళ్ళ క్రితమే రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇంతకాలానికి కుదిరింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాది పాటు ఈ స్క్రిప్ట్ గురించి ఆలోచించారు. ఈ కథ విని నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటిదాకా రాజమౌళి చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైం ట్రావెల్ ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. మొదట ఇందులో హీరోగా చేయడానికి భయపడ్డాను. రాజమౌళి నా భయాన్ని పోగొట్టారు. ఈ సినిమాలో నేను రాముడిగా కనిపిస్తాను. రాముడి పాత్ర కావడంతో నిలబడే విధానం దగ్గర నుంచి నటించడం వరకు పర్ఫెక్ట్ గా ఉండటం కోసం ఎన్నో రిహార్సల్స్ చేశాం." అన్నారు.

ఇక రాజమౌళి మాట్లాడుతూ.. "నాకున్న వేరే కమిట్ మెంట్స్ కారణంగా మహేష్ తో సినిమా 15 ఏళ్ళు ఆలస్యమైనా.. ఇప్పుడు 'వారణాసి'ని భారీస్థాయిలో రూపొందిస్తున్నాం. ఈ మూవీ రన్ టైం 3 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఇంత ఎక్కువ రన్ టైంలో మూడు నిమిషాలు ఆసక్తికరంగా లేకపోయినా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుకే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా.. ప్రతిక్షణం ఆసక్తికరంగా, కొత్త అనుభూతిని పంచేలా దీనిని రూపొందిస్తున్నాం. వారణాసిలో 25 నిమిషాలు పురాణాలపై చిత్రీకరించాం. ఆ సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు." అని చెప్పుకొచ్చారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.