English | Telugu
ప్రముఖ నటి హేమ ఇంట తీవ్ర విషాదం!
Updated : Nov 18, 2025
ప్రముఖ నటి హేమ(Actress Hema) ఇంట విషాదం చోటు చేసుకుంది. హేమ తల్లి కోళ్ల లక్ష్మి(Kolla Lakshmi) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపటున్న కోళ్ల లక్ష్మి.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో నిన్న రాత్రి 10:30 లకు తుదిశ్వాస విడిచారు.
విషయం తెలుసుకున్న హేమ.. వెంటనే రాజోలుకి వెళ్లారు. తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. రాజోలులోనే హేమ తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
కెరీర్ తొలినాళ్లలో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తన తల్లి ఎనలేని కృషి చేశారని ఇటీవల తెలుగువన్ కి ఇంటర్వ్యూలో హేమ తెలిపారు. తనను మొదటినుండి అంతలా సపోర్ట్ చేసిన తల్లి మరణంతో హేమ శోక సంద్రంలో మునిగిపోయారు.
హేమ తల్లి కోళ్ల లక్ష్మి మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.