English | Telugu

జపాన్‌లో ఉన్న ప్రభాస్‌కి రాజమౌళి లేఖ.. సోషల్‌ మీడియాలో వైరల్‌!

బాహుబలి1, బాహుబలి2 చిత్రాలను కలిపి 'బాహుబలి ది ఎపిక్‌' పేరుతో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభాస్‌కు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 12న అక్కడ విడుదల చేయబోతున్నారు.


ఈ సందర్భంగా బాహుబలి ది ఎపిక్‌ స్పెషల్‌ స్క్రీనింగ్‌ కోసం జపాన్‌ వెళ్ళారు ప్రభాస్‌. అక్కడి అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ముగ్ధుడైపోయారు. ఎంతో ఆనందంగా అభిమానులతో ముచ్చటించారు. 'మీ ప్రేమకు ధన్యవాదాలు. బాహుబలి తర్వాత రాజమౌళి, శోభు మీ గురించి, మీరు నాపై చూపిస్తున్న అభిమానం గురించి చెప్పారు. పదేళ్లుగా ఇక్కడి అభిమానుల గురించి వింటూనే ఉన్నాను. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈరోజు మీ అందర్నీ చూడగలిగాను. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను' అన్నారు.


ఈ సందర్భంలోనే రాజమౌళి తనకు రాసిన లేఖను అభిమానులకు చదివి వినిపించారు ప్రభాస్‌. ఆ లేఖలోని సారాంశం ఇది.. 'నేను జపాన్‌ నాలుగు సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రేక్షకులు, అభిమానులు నన్ను ఒకే మాట అడిగేవారు. 'ప్రభాస్‌ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారు' అని. అందుకే నా బాహుబలి ఇప్పుడు తన రెండో ఇంటికి వచ్చాడు. ఈ పర్యటనను బాగా ఎంజారు చేస్తున్నావని అనుకుంటున్నాను' అంటూ ఎంతో ప్రేమగా రాజమౌళి రాసిన లేఖను చదవగానే థియేటర్‌ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ లేఖపై ప్రభాస్‌ స్పందిస్తూ.. 'రాబోయే రోజుల్లో మనిద్దరం కలసి జపాన్‌కు వద్దాం' అని పోస్ట్‌ పెట్టారు. ప్రభాస్‌కి రాజమౌళి రాసిన లేఖ, దానికి ప్రభాస్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.