English | Telugu

టాలీవుడ్ ని భయపెడుతున్న డిసెంబర్ 4 

సినిమా వాళ్ళకి సెంటిమెంట్ లు ఎక్కువ. తేదీల విషయంలోనూ ఆ సెంటిమెంట్ లను పట్టించుకుంటారు. టాలీవుడ్ కి లక్కీ డేట్ అంటే ఏప్రిల్ 28 గా చెబుతారు. ఎందుకంటే ఆ డేట్ కి విడుదలైన అడవి రాముడు, పోకిరి, బాహుబలి-2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఇప్పుడు డిసెంబర్ 4 అనేది అన్ లక్కీ డేట్ గా ముద్రపడింది.

గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2(Pushpa 2: The Rule) ప్రీమియర్స్ సందర్భంగా.. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారు. అదే ఘటనలో కోమాలోకి వెళ్ళిపోయిన రేవతి తనయుడు శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. టాలీవుడ్ చరిత్రలో డిసెంబర్ 4 అనేది ఓ కాళరాత్రిలా మిగిపోయింది.

Also Read: పెళ్లయిన ఐదు రోజులకే.. వైరల్ గా మారిన సమంత పోస్ట్..!

డిసెంబర్ 4 నెగటివ్ సెంటిమెంట్ ఈ ఏడాది కూడా కొనసాగింది. డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్స్ తో 'అఖండ 2 తాండవం'(Akhanda 2: Thaandavam) సందడి థియేటర్స్ లో మొదలు కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక బడా మూవీ ఇలా వాయిదా పడిన సందర్భం దాదాపు లేదనే చెప్పాలి.

పుష్ప-2 విషయంలో తొక్కిసలాట ఘటన, 'అఖండ 2' విషయంలో సినిమా వాయిదా.. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎవరైనా తమ సినిమాని డిసెంబర్ 4 కి విడుదల చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.