English | Telugu

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. సందీప్ రెడ్డి మాట నిలబెట్టుకుంటాడా?

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
ఎట్టకేలకు సెట్స్ పైకి స్పిరిట్
షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందనున్న 'స్పిరిట్' (Spirit) మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నవంబర్ చివర్లో షూటింగ్ మొదలవుతుందని ఇటీవల సందీప్ రెడ్డి చెప్పారు. అయినప్పటికీ ఫ్యాన్స్ లో చిన్న అనుమానం ఉంది. అయితే ఈసారి ఎటువంటి డౌట్ అక్కర్లేదని, డేట్ కూడా లాక్ అయిందని తెలుస్తోంది.

నిజానికి స్పిరిట్ మూవీ ప్రకటన వచ్చి చాలా కాలమైంది. గతేడాది షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు.. కానీ, అది జరగలేదు. ఈ ఏడాదైనా సెట్స్ పైకి వెళ్తుందా? అని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.

ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబో కావడంతో ప్రకటనతోనే 'స్పిరిట్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ లో ఆడియో టీజర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందుకే 'స్పిరిట్' కోసం ఫ్యాన్స్ ఇంతలా వెయిట్ చేస్తున్నారు.

Also Read: బాలయ్య, బోయపాటి మధ్య విభేదాలు.. ఈ ఈవెంట్ తో క్లారిటీ వచ్చేసింది!

ఇటీవల 'జిగ్రీస్' మూవీ ఈవెంట్ లో సందీప్ మాట్లాడుతూ.. నవంబర్ చివరిలో 'స్పిరిట్' స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అయితే గతేడాది నుండి అదిగో ఇదిగో అంటున్నారు తప్ప మొదలవ్వట్లేదు. ఈసారి కూడా అలాగే అవుతుందని అభిమానుల్లో కాస్త భయం ఉంది.

ఈసారి ఫ్యాన్స్ కి ఎలాంటి భయం అక్కర్లేదని, 'స్పిరిట్'కి ముహూర్తం ఖరారైందని సమాచారం. నవంబర్ 23న ఈ మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

సందీప్ రెడ్డికి వేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తాడనే పేరుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి తగినంత టైం కేటాయించి, పక్కా ప్లాన్ తో షూట్ కి వెళ్తుంటాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. వచ్చే ఏడాది 'స్పిరిట్' థియేటర్లలో అడుగుపెట్టే అవకాశముంది.

ఇంకో విశేషం ఏంటంటే.. స్పిరిట్ కోసం ప్రభాస్ కి అదిరిపోయే లుక్ ని డిజైన్ చేశారట. ఈ లుక్ ఫ్యాన్స్ తో పాటు, అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.