English | Telugu

మెగాస్టార్‌ చిరంజీవి క్లాప్‌తో ప్రారంభమైన ‘స్పిరిట్‌’.. మరి ప్రభాస్‌ ఎక్కడ?

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు నవంబర్‌ 23న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. మెగాస్టార్‌ క్లాప్‌తో స్టార్ట్‌ అయిన ఈ పూజా కార్యక్రమాల్లో సందీప్‌రెడ్డి వంగా, నిర్మాతలు, త్రిప్తి డిమ్రి పాల్గొన్నారు. అయితే ప్రభాస్‌ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు.

ప్రభాస్‌ లుక్‌ టెస్ట్‌ ఇప్పటికే పూర్తయింది. ప్రభాస్‌ లుక్‌ అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ప్రకాశ్‌రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, డాన్‌ లీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తారు. దగ్గుబాటి అభిరామ్‌ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్‌రెడ్డి.. ఆ సినిమాలను మించే స్థాయిలో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని రూపొందిస్తారని తెలుస్తోంది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్‌ నటించే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. హై ఓల్టేజ్‌లో ఉండే యాక్షన్‌ ఎపిసోడ్స్‌, భారీ ఎమోషన్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌లాంటి సినిమాగా ‘స్పిరిట్‌’ రూపొందనుంది.

నవంబర్‌ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. సందీప్‌రెడ్డి సినిమాల్లోని క్యారెక్టర్స్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయానికి వస్తే అంతకుమించి అన్నట్టుగా క్యారెక్టర్స్‌ని డిజైన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రభాస్‌ సినిమాల కంటే వేగంగా ఈ సినిమాను పూర్తి చేస్తారని సమాచారం. అందుకే ఈసారి తన డైరెక్షన్‌ టీమ్‌లోకి 20 మందిని తీసుకున్నారు సందీప్‌. వారిలో త్రివిక్రమ్‌ కుమారుడు రిషి మనోజ్‌, రవితేజ కుమారుడు మహాధన్‌ కూడా ఉన్నారని తెలుస్తోంది. యానిమల్‌ చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాడు సందీప్‌. ఇప్పుడు స్పిరిట్‌కి సెట్‌ చేసుకున్న టీమ్‌తో అంతకంటే వేగంగా సినిమాను పూర్తి చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.