English | Telugu

అఖండ 2 చూసిన యోగి ఆదిత్యనాథ్.. రిపోర్ట్ ఇదే 

అఖండ 2 పై యోగి ఆదిత్యనాధ్ రిపోర్ట్ ఏంటి!
త్రిశూలాన్ని బహుకరించిన చిత్ర బృందం
బాలయ్య శివ తాండవం చూడటానికి రెడీనా
ట్రైలర్ రిలీజ్ తో భారీ అంచనాలు


ఇంకెన్ని రెండు వారాలు.. రెండంటే రెండు వారాలు.. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)చేసే శివ తాండవంతో పాన్ ఇండియా థియేటర్స్ కళకళ లాడానికి ఉన్న సమయం. ఈ లోపు యాజమాన్యం తమ థియేటర్స్ ని పక్కాగా రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి. అఖండ సౌండ్ కి కొన్ని థియేటర్స్ లో సౌండ్ బాక్స్ లు తట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో అఖండ 2 కి సరికొత్తగా ముస్తాబవక తప్పదు. మల్టిప్లెక్స్ కి కూడా మినహాయిపు లేదు.


ఇక బాలయ్య, బోయపాటి(Boyapati srinu)తో పాటు చిత్ర బృందం మొత్తం జెట్ స్పీడ్ వేగంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్' ని కలవడం జరిగింది. అఖండ 2 యొక్క కథా నేపధ్యాన్నియోగి ఆదిత్యనాథ్ కి వివరించడంతో పాటు చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలని చూపించారు. మూవీలో శివస్తుతుడుగా బాలయ్య చేతబూనిన త్రిశూలాన్ని కూడా ఆయనకి అందచేశారు. అనంతరం భక్తి,ధర్మంప్రధానంగా అఖండ 2 ని నిర్మించడంపై బాలయ్య, బోయపాటి ని యోగి ఆదిత్యనాథ్అభినందించడం జరిగింది. సుదీర్ఘ కాలం నుంచి దైవ సేవకుడిగా కాషాయ వస్త్రాలు ధరిస్తూ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నయోగి ఆదిత్యనాథ్నిచిత్ర బృందం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


also read:మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య!

ఇక అఖండ 2 కథ విషయానికి వస్తే భారత దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ధర్మమే త్రిశూలం పట్టుకొని యుద్దానికి దిగితే ఎలా ఉంటుందో అనే అంశాలతో తెరకెక్కింది. ట్రైలర్ తో ఈ విషయం అర్దమవ్వడంతో అసేతు హిమాచాలం అఖండ 2 రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. 14 రీల్స్ , బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతలు కాగా మరో శివస్తుతుడు తమన్(Thaman) మ్యూజిక్. ఆదిపినిశెట్టి(Aadhi Pinisetty)ప్రతినాయకుడు కాగా సంయుక్త మీనన్(samyuktha menon)హీరోయిన్.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.