English | Telugu

శృంగార కోరికలను అదుపు చేసుకోలేని బోల్డ్ పాత్రలో పాయల్!

అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100'తో హీరోయిన్ గా పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమాలో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంటుంది. తన అందం, అభినయంతో కుర్రకారుని కట్టపడేసింది. అయితే ఇప్పుడు అంతకుమించిన బోల్డ్ పాత్రతో అలరించడానికి సిద్ధమవుతోంది పాయల్.

'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్, అజయ్ భూపతి కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'మంగళవారం'. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎంతో ఇంటెన్స్ గా, టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో ఉండబోతుందని ట్రైలర్ తో స్పష్టమైంది. అలాగే పాయల్ క్యారెక్టర్ బోల్డ్ గా ఉండనుందని అర్థమైంది. అయితే ఆమె క్యారెక్టర్ ఊహించిన దానికంటే చాలా బోల్డ్ గా ఉంటుందట. ఇందులో పాయల్ శృంగార కోరికలను అదుపు చేసుకోలేని యువతి పాత్రలో కనిపిస్తుందట. సంభాషణల రూపంలో చెప్పనప్పటికీ ట్రైలర్ లో చూపించిన కొన్ని సన్నివేశాల్లో ఆమె ప్రవర్తనను గమనిస్తే అది నిజమే అని అర్థమవుతోంది. 'ఆర్ఎక్స్ 100'తో ఒక ఊపు ఊపిన పాయల్.. ఈ సినిమాతో కుర్రకారుకి పిచ్చెక్కించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.