English | Telugu

రజనీ కాంత్ సరికొత్త రికార్డు..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ 

2023 అగస్ట్ 9 వ తారీకుని కాలగమనం లో అందరు మర్చిపోవచ్చు గాని రజనీ కాంత్ అభిమానులు మాత్రం ఎప్పటికి మర్చిపోలేరు. ఎందుకంటే ఆ రోజు రజనీ నటించిన జైలర్ సినిమా విడుదలయ్యి వరుస ప్లాప్ లతో ఉన్న రజనీకి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన రోజు. జైలర్ సినిమా విజయం సాధించడంతోపాటు కలెక్షన్ల విషయంలో కూడా ఎన్నో రికార్డు లు సృష్టించడంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు ఎంతగానో ఆనందపడ్డారు. ఇప్పుడు రజనీ అభిమానులకి మరింత ఆనందాన్ని
కలిగించేలా జైలర్ సినిమా సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసింది.

జైలర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఆ మూవీ లోని హుకుం సాంగ్ కూడా అంతే ఘన విజయాన్ని సాధించింది. చిన్నా పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా భారతదేశ వ్యాప్తంగా హుకుం సాంగ్ మారుమోగిపోయింది. దీంతో ఇప్పుడు హుకుం సాంగ్ రికార్డు స్థాయిలో 100 మిలియన్స్ వ్యూస్ ని సంపాదించింది.దీంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులంతా తలైవా తో పెట్టుకుంటే రికార్డు లు ఇలాగే ఉంటాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

హుకుం సాంగ్ ని అనిరుద్ సూపర్ గా కంపోజ్ చేసాడు. అలాగే ఆ సాంగ్ లో రజనీ చేసిన పెర్ఫార్మెన్సు కి థియేటర్లు మొత్తం పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. అందుకే సినిమా చూసిన ప్రతి వాళ్ళు మళ్ళీ బయట రిపేటెడ్ గా హుకుం సాంగ్ ని తమకున్న ప్రచార సాధనాల ద్వారా విన్నారు. అందుకే హుకుం సాంగ్ రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించింది. జైలర్ మూవీ ఈ దీపావళి కి ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమినీ లో ప్రసారం కాబోతుంది.