English | Telugu
భారతీయ చిత్ర పరిశ్రమకి ఆయనతోనే ఎంతో మేలు..పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Updated : Nov 17, 2025
-ఉస్తాద్ రాకకోసం వెయిటింగ్
-హైదరాబాద్ పోలీస్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
-భారతీయ చిత్ర పరిశ్రమకి ఎంతో మేలు
-అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు
ఓజి తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనపడతా అనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. పవన్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)మాత్రం హరీష్ శంకర్(Harish Shankar)దర్శకత్వంలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటు ఉంది. రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఉస్తాద్ రాక కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదు.
రెండు రోజుల క్రితం కొత్త సినిమాలని రిలీజ్ రోజే పైరసీ చేస్తు కోట్ల రూపాయలని సంపాదిస్తున్న ఐ బొమ్మ నిర్వాహకుడుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సిటీ కమిషనర్ సజ్జనార్ కి చిత్ర బృందం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తు డబ్బుల పరంగానే కాదు, సృజనాత్మకతని పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలని విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది.
సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలని కట్టడి చేయడం దర్శకనిర్మాతలకి సాధ్యం కావడం లేదు. పైగా పైరసీ ముఠా పోలీసులకి సవాల్ విసిరే స్థాయికి వచ్చింది. అటువంటి తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. పైరసీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ అంశం.
also read: నా క్యారక్టర్ ని పుష్ప తో పోల్చవద్దు. పృథ్వీరాజ్ సుకుమారన్ అభ్యర్ధన
ఈ ఆపరేషన్ లో భాగమైన పోలీసులకి, సిటీ కమిషనర్ సజ్జనార్ కి నా అభినందనలు . ఒకసారి నేను సజ్జనార్ తో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారు. బెట్టింగ్ యాప్స్ ని కూడా నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోను కదలిక తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకి మేలు చేస్తాయని పవన్ తెలిపారు.