English | Telugu

పవర్ స్టార్ అంటేనే నిజాయితీ

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీ రంగ ప్రవేశం గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నా విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించబోయే ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఇంతకు ముందు పూరీ పేరు వినిపించినప్పటికి, పూరీని ఎందుకు వద్దనుకున్నారు? పూరీని వద్దనడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వార్తలు వినిపించాయి.

ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "కెమరామన్ గంగతో రాంబాబు" చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, దాంతోనే వరుణ్ తేజ్ ఎంట్రీ ప్రాజెక్టును పూరీకి ఇవ్వకుండా పవన్ అడ్డుకున్నాడని పుకార్లు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ అసలు ఈ ప్రాజెక్టుకు ఎవరిని కూడా సజెస్ట్ చేయలేదంట. ఇదంతా కేవలం నిర్మాత అశ్వనీదత్ తీసుకున్న నిర్ణయం అని తెలిసింది. దీనిబట్టి తెలిసిందేమిటంటే.... పవన్ అసలు ఎవర్ని ఏం అనలేడు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమేనని మరోసారి తెలిసింది.

అసలే పవన్ కళ్యాణ్ అంటే శాంతి, అహింస, నిజాయితీ అనే వాటికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ.. అందరిని ఒకే విధంగా చూసే మంచి మనసున్న కొందరు వ్యక్తులలో పవన్ ఉంటాడని మరోసారి రుజువైనట్లే. మరి పవర్ స్టార్ అంటే మజాకా?