English | Telugu

ఓజి vs సంక్రాంతికి వస్తున్నాం.. ఎవరిది పై చేయి 

-ఓజి కలెక్షన్స్ ఎంత!
-సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ !
-ఎవరు గెలిచారు
-పవన్, వెంకటేష్ కి మంచి బూస్టప్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan),వెంకటేష్(venkatesh)చూడని హిట్ లేదు. సృష్టించని రికార్డు లేదు. కొంత కాలంగా విజయాల పరంగా వెనకపడ్డ ఈ హీరోలిద్దరు ఓజి(OG)సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొన్నారు. అందుకోవడంలో కూడా అలాంటి ఇలాంటి హిట్ ని అందుకోలేదు. తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా కెరీర్ లోనే మొదటి చిత్రాలుగా నిలిచాయి. సదరు రికార్డు కలెక్షన్స్ తో తెలుగు సినిమాకి సరికొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రెండు చిత్రాలకి సంబంధించి బాక్స్ ఆఫీస్ వద్ద నమోదైన రికార్డులకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


ఓజి పూర్తి రన్నింగ్ లో వరల్డ్ వైడ్ గా 308 కోట్లు రూపాయిలు వసూలు చేసింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మేకర్స్ ఒక పోస్టర్ తో అధికారకంగా కూడా ప్రకటించారు. ఈ రికార్డు ఓజి ముందు వరకు సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)పేరుపై ఉండేది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 303 కోట్లు రాబట్టింది. ఈ రికార్డుని కూడా అధికారికంగానే ప్రకటించారు. కానీ ఓన్లీ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయాన్ని చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం ని ఓజి క్రాస్ చెయ్యలేకపోయింది. ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఓజి 190.45 కోట్లు రాబట్టగా సంక్రాంతికి వస్తున్నాం 195.45 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం' ని 'ఓజీ' అధిగమించలేకపోయిందనే టాక్ సోషల్ మీడియాలో వినపడుతుంది.

Also Read: ఘనంగా నారా రోహిత్ పెళ్లి.. మీరు కూడా చూసి ఆనందించండి

అలాగే ఇప్పటి వరకు రిలీజైన చిత్రాలు కలెక్షన్స్ పరంగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారని కూడా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. సంక్రాంతికి వస్తున్నాం', 'ఓజీ' మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత వరుస స్థానాల్లో గేమ్ చేంజర్ (93.80 కోట్లు), 'డాకు మహారాజ్' (90 కోట్లు), 'హరిహర వీరమల్లు' ( 85.75 కోట్లు), 'మిరాయ్' (73.25 కోట్లు), 'తండేల్' (68.00 కోట్లు), 'హిట్ 3' (67.65 కోట్లు), 'కుబేర' (67.30 కోట్లు), 'మ్యాడ్ స్క్వేర్' (52.20 కోట్లు), 'కింగ్డమ్' (50.50 కోట్లు) నిలిచినట్టుగా పేర్కొన్నాయి