English | Telugu

రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్.. కారణం తెలుసా..?

- ముంబై వెళ్ళిన తెలంగాణ సీఎం
- రేవంత్ రెడ్డితో సల్మాన్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) కలిశారు. గురువారం సాయంత్రం ముంబైలో వీరి భేటీ జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు రేవంత్ రెడ్డిని సల్మాన్ ఖాన్ కలవడానికి కారణమేంటి? అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.

'తెలంగాణ రైజింగ్' నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నినాదానికి సల్మాన్ ఖాన్ తన మద్దతు తెలిపాడు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి, తెలంగాణ అభివృద్ధి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని సల్మాన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తీరుని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సల్మాన్ అభినందించినట్లు సమాచారం.

ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంట్లో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను అటు సల్మాన్ అభిమానులు, ఇటు రేవంత్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.

Also Read: మాస్ జాతర బిజినెస్.. ఈసారైనా హిట్ కొడతాడా..?