English | Telugu

మాస్ జాతర బిజినెస్.. ఈసారైనా హిట్ కొడతాడా..?

- వరుస ఫ్లాప్స్ లో రవితేజ
- మాస్ జాతర పైనే ఆశలన్నీ
- బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?
- రవితేజ హిట్ కల నెరవేరుతుందా?

ఒక మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ (RaviTeja).. ఇప్పుడు 'మాస్ జాతర'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయంలో సేఫ్ గేమ్ ఆడినట్లు అర్థమవుతోంది. (Mass Jathara)

2018 నుంచి ఈ ఏడేళ్లలో రవితేజ హీరోగా నటించిన 12 సినిమాలు విడుదల కాగా.. అందులో 'క్రాక్', 'ధమాకా' మాత్రమే విజయం సాధించాయి. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో రవితేజ ఆలోచనలో పడ్డాడు. అందుకే తనకి బాగా అచ్చొచ్చిన, గతంలో ఎన్నో విజయాలను అందించిన 'యాక్షన్ కామెడీ' జానర్ ను నమ్ముకొని 'మాస్ జాతర' చేశాడు. ఈ మూవీ అక్టోబర్ 31 సాయంత్రం నుండి థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: బోయపాటి శ్రీను హిట్స్ & ఫ్లాప్స్.. ఆ ఒక్క సినిమా..?

ప్రస్తుత రవితేజ ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకొని.. 'మాస్ జాతర' బిజినెస్ విషయంలో మేకర్స్ రిస్క్ చేయలేదని తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల లోపే జరిగినట్లు సమాచారం. నైజాంలో రూ.5.5 కోట్లు, సీడెడ్ లో రూ.2.5 కోట్లు, ఆంధ్రాలో రూ.7.5 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.15.5 కోట్ల బిజినెస్ చేసిందట. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, ఓవర్సీస్ రూ.2 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంటే హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.20 కోట్ల షేర్ రాబట్టాల్సింది ఉంది.

గత కొన్నేళ్ళుగా రవితేజ మెజారిటీ సినిమాలు 20 కోట్లకు అటూఇటూగా థియేట్రికల్ బిజినెస్ చేశాయి. 30 కోట్లకు పైగా బిజినెస్ చేసిన టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ సినిమాలు మాత్రం భారీ నష్టాలను మిగిల్చాయి. రవితేజ స్టార్డమ్ కి 20 కోట్ల బిజినెస్ అనేది సేఫ్ గేమ్ అని చెప్పవచ్చు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. మంచి లాభాలు పొందే అవకాశముంది. మరి 'మాస్ జాతర' అదే బాటలో పయనించి.. రవితేజ ఎదురుచూస్తున్న విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.