English | Telugu

బిగ్ సర్ ప్రైజ్.. పీపుల్ మీడియాతో పవన్ కళ్యాణ్..!

పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో 'బ్రో' మూవీ వచ్చింది. పవన్ నటించిన 'హరి హర వీరమల్లు' విడుదల సమయంలో ఇబ్బందులు తలెత్తగా.. పీపుల్ మీడియా తన వంతు సహాయ సహకారాలు అందించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. పీపుల్ మీడియాతో పవన్ చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హీరోగా సినిమాలు తగ్గించారు. త్వరలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పలకరించనున్నారు. దీని తర్వాత హీరోగా పెద్దగా సినిమాలు చేసే అవకాశంలేదు. పవన్ సైతం ఇటీవల ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. హీరోగా సినిమాలు చేయకపోవడం కుదరకపోవచ్చని, సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టబోతున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో గతంలో పవన్ ఒక బ్యానర్ స్థాపించారు. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తన బ్యానర్ లో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ఈ కొలాబరేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది అంటున్నారు.