English | Telugu

ఆగస్ట్ లో యన్ టి ఆర్ న్యూ మూవీ రిలీజ్

ఆగస్ట్ లో యన్ టి ఆర్ న్యూ మూవీ రిలీజ్ కానుందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్‍ యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ రానున్న ఆగస్ట్ లో రిలీజ్ కానుందట. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, యన్ టి ఆర్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం రానున్నఆగస్టు నెలలో రిలీజ్ అవుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ చిత్రం తొలి షెడ్యుల్ 32 రోజుల పాటు హైదరాబాద్, పఠాన్ చెరువు, ఆ తదితర ప్రాంతాల్లో జరుపుకుంది.


ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఏప్రెల్ పదహారవ తేదీ నుండి ప్రారంభం కానుంది. యన్ టి ఆర్, ఇలియానా జంటగా నటించగా ఇటీవల విడుదలైన "శక్తి" చిత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ఘోరమైన ఫ్లాపుగా నిలిచింది. దాంతో యన్ టి ఆర్ ఇకనుంచి తన చిత్రాలన్నీ ఇరవై కోట్ల రూపాయల సాధారణ బడ్జెట్ లోపే ఉండాలని తనతో సినిమాలను నిర్మించే నిర్మాత, దర్శకులకు కండిషన్ పెట్టబోతున్నారట. ఇది స్వాగతించాల్సిన ఒక మంచి నిర్ణయమని చెప్పవచ్చు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.