English | Telugu

మహేష్, మణిరత్నం మూవీలో ప్రియాంక చోప్రా

మహేష్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రాబోయే మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు, విజయ్, ఆర్య హీరోలుగా, మణిరత్నం దర్శకత్వంలో రెండువందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో, రెండు భాగాలుగా నిర్మించబడుతున్న చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. తమిళంలోవ్రాయబడిన ప్రఖ్యాత చారిత్రాత్మక నవల "పొన్నియన్ సెల్వన్" ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో రెండువందల కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రూపుదిద్దుకోనుంది.

ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటింపజేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో నటించటానికి ప్రియాంక చోప్రా కూడా సుముఖుంగానే ఉందని తెలిసింది. అయితే ఆమె షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల మణిరత్నం ను కలవలేకపోతుందట. ఇ చిత్రంలో మరో ప్రముఖ హీరోయిన్ అనుష్క హీరో మహేష్ బాబుకి సోదరిగా, విజయ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.