English | Telugu

'ఎన్టీఆర్ 30'.. న్యూ ఇయర్ సర్ ప్రైజ్ అదిరింది!

'ఎన్టీఆర్ 30'.. న్యూ ఇయర్ సర్ ప్రైజ్ అదిరింది!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు 'ఎన్టీఆర్ 30' అప్డేట్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా షూట్, రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చి మేకర్స్ సర్ ప్రైజ్ చేశారు.

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రకటన ఏడు నెలల క్రితమే వచ్చినా.. ఇంతవరకు మొదలు కాలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. 'ఎన్టీఆర్ 30' అప్డేట్స్ కోసం వాళ్ళు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్ళ ఎదురుచూపులు ఫలించి, న్యూ ఇయర్ కానుకగా 'ఎన్టీఆర్ 30' సర్ ప్రైజ్ అప్డేట్ వచ్చింది.

'ఎన్టీఆర్ 30' షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2024, ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నట్లు  అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.

'ఎన్టీఆర్ 30'.. న్యూ ఇయర్ సర్ ప్రైజ్ అదిరింది!