English | Telugu
నేను ఏడిస్తే నచ్చదు
Updated : Jun 24, 2013
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం "బలుపు". ఈ చిత్రం జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి రవితేజ మాట్లాడుతూ... "డాన్ శీను" చిత్రం తర్వాత గోపీచంద్ తో చేయడం చాలా బాగుంది. ఫుల్ మాస్, మసాల, కామెడీ చిత్రంగా ఉంటుంది. నా కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం "బలుపు". థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. నేను పాడిన పాట కూడా మంచి హిట్టయ్యింది. నేను నవ్విస్తేనే బాగుంటది. ఏడిస్తే జనాలేవరికి నచ్చదు. అందుకే "దరువు" మంచి సినిమా అయిన కూడా అందులో నా క్యారెక్టర్ కాస్త ఏడుపు సీన్ లలో కనిపించేసరికి ఎవరికి అంతగా నచ్చలేదు. కానీ నా చిత్రంలో ఎంతవరకు అభిమానులను ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటారో అవన్నే బలుపు చిత్రంలో ఉంటాయి. శ్రుతిహాసన్, అంజలి మంచి పాత్రలలో నటించారు. బ్రహ్మానందంతో చేసిన కామెడీ అదిరిపోయింది. ఈ చిత్రం సూపర్ హిట్టవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
మరి జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "బలుపు" చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రం కూడా విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ... "బలుపు" చిత్రానికి ఆల్ ది బెస్ట్.