English | Telugu
రామయ్యా పరిస్థితేంటి?
Updated : Jun 24, 2013
తెలుగులో "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రభుదేవా. ఈ చిత్రం తర్వాత తెలుగులో సూపర్ డూపర్ హిట్టయిన "పోకిరి" చిత్రాన్ని "వాంటెడ్" పేరుతో, "విక్రమార్కుడు" చిత్రాన్ని "రౌడీ రాథోడ్" పేర్లతో హిందీలో రీమేక్ చేసి ప్రభుదేవా అక్కడ కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రభుదేవా ప్రస్తుతం "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" చిత్రాన్నీ హిందీలో "రామయ్యా వస్తావయ్య" పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అయితే ఇంతకు ముందు ప్రభుదేవా హిందీలో రీమేక్ చేసిన అన్నీ సినిమాలు కూడా పూరీజగన్నాథ్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చాయి. కానీ "రామయ్యా వస్తావయ్య" చిత్రం మాత్రం తెలుగులో ప్రభుదేవా దర్శకత్వం వహించిన "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"కు రీమేక్ కావడం విశేషం. మరి ఈ "రామయ్యా వస్తావయ్య" చిత్రం హిందీలో విజయం సాధిస్తుందో లేదో చూడాలి.