English | Telugu

నా సామి రంగ.. సంక్రాంతికి తగ్గేదేలే!

విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ తో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టడం కింగ్ నాగార్జునకు అలవాటుగా మారింది. 2024 సంక్రాంతికి కూడా పల్లెటూరు నేపథ్యంలో రూపొందుతోన్న మాస్ ఎంటర్టైనర్ 'నా సామి రంగ' తో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశముందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ మాత్రం సంక్రాంతికే వస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా తేదీని ప్రకటించారు.

విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న 'నా సామి రంగ' సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి, టీజర్ కి, ఇతర ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2024, జనవరి 14న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆశిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్‌ ధిల్లన్‌ నటిస్తున్నారు.