English | Telugu

అది మన మాస్ మహారాజా గొప్పతనం!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలోనూ, ఇతరులను ప్రోత్సహించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి రవితేజ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు.

సాధారణంగా తమ సినిమాకు పోటీగా విడుదలయ్యే సినిమాలో భాగం కావడానికి హీరోలు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ రవితేజ అలా కాదు. తాను నటించిన 'ఈగల్' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో 'హనుమాన్' కూడా విడుదలవుతోంది. అయినప్పటికీ రవితేజ 'హనుమాన్' సినిమాలో ఒక పాత్ర కోసం వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఇది రవితేజ మంచితనానికి నిదర్శనం. తాజాగా హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం ఇదే అభిప్రాయపడ్డాడు.

"క్లాష్ లో వస్తున్నామంటే సాధారణంగా అందరూ తొక్కేద్దాం అని చూస్తారు. కానీ రవితేజ గారు మా సినిమాలో ఒక క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయనలాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో" అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.