English | Telugu

'కాంత'పై కోర్టులో కేసు వేసిన ప్రముఖ హీరో మనవడు.. 14న రిలీజ్ ఉందా! 

చిక్కుల్లో కాంత
త్యాగరాజ భాగవతార్ మనవడు పిటిషన్
14న రిలీజ్ అవుతుందా?

బాక్స్ ఆఫీస్ ని తన వశం చేసుకోవడానికి ఈ నెల 14న రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ 'కాంత'(Kaantha). మలయాళ, తెలుగు చిత్ర పరిశ్రమలో సమానమైన క్రేజ్ ని సంపాదించిన 'దుల్కర్ సల్మాన్'(Dulquer Salmaan) హీరో కాగా, మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్. రానా దగ్గుబాటి(Rana Daggubati)తో కలిసి దుల్కర్ సల్మాన్ 'కాంత' ని తమిళంలో డైరెక్ట్ సినిమాగా నిర్మించడం కాంత స్పెషాలిటీ. అందుకు కారణం కూడా లేకపోలేదు. కాంత చిత్రం మొట్టమొదటి తమిళ హీరో 'ఏంకే త్యాగరాజ భాగవతార్'(Mk Thyagaraja Bhagavathar) జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ప్రచార చిత్రాలతో పాటు ట్రైలర్ ద్వారా ఈ విషయం స్పషంగా అర్ధమవుతుంది.

రీసెంట్ గా చెన్నై కోర్టులో త్యాగరాజ భాగవతార్ మనవడు ఒక పిటిషన్ వేసాడు. సదరు పిటిషన్ లో కాంత మూవీలో తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే విషయాన్నీ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం సౌత్ సినీ పరిశమ్రలో సంచలనంగా మారడంతో పాటు కోర్టు తీర్పు ఎలా వస్తుందనే టెన్షన్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో ఉంది. కాంత కథ మెయిన్ పాయింట్ ని ఒకసారి చూసుకుంటే దర్శకుడు, స్టార్ హీరో మధ్య తలెత్తిన విభేదాలతో తెరకెక్కింది. ఆ విబేధాలకి కారణం ఇగో, ఆర్ట్, గౌరవం.

Also Read:హరిహర వీరమల్లు ఆర్ట్ డైరెక్టర్ కి ఫ్రాన్స్ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏంకే త్యాగరాజ భాగవతార్ సినీ జీవితాన్ని ఒకసారి చూసుకుంటే భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్ త్యాగరాజ భాగవతార్ నే. పూర్తి పేరు 'మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్ విశ్వకర్మ'. శాస్త్రీయ సంగీత గాయకుడిగా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత నాటకాలు, సినిమాల ద్వారా అపార ఖ్యాతిని సంపాదించాడు. 1934లో వచ్చిన ‘పావలక్కోడి’ ఆయన తొలి సినిమా. సుమారు పద్నాలుగు సినిమాలు చేసిన తర్వాత నిర్మాత శ్రీరాములు నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు జర్నలిస్ట్‌ లక్ష్మీకాంతన్‌ హత్య కేసులో భాగవతార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు.

బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు తిరిగి ఆయన్నిహీరోగా స్వీకరించలేదు. నవంబర్ 1, 1959లో 49 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. కాకపోతే 1944లో వచ్చిన ‘హరిదాస్’ చిత్రం మద్రాస్ బ్రాడ్‌వే థియేటర్‌లో మూడు సంవత్సరాలపాటు నిరంతర ప్రదర్శన పొందిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కాంత సినిమాలో ఏ ఏ అంశాలని పొందుపరిచారనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది. రానా దగ్గుబాటి, సముద్ర ఖని కూడా కీలక పాత్రల్లో తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.