English | Telugu

ఆ సినిమాయే పోటుగాడు

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "పోటుగాడు". ఈ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించిన "గోవిందాయనమః" రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులు చేసారు కానీ, కథ మొత్తం ఒరిజినల్ కన్నడ చిత్రానికి సంబంధించినదే.

రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ లో లగడపాటి శ్రీధర్, శిరీష సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అచ్చు సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో జూలై నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో మనోజ్ ఓ పాట కూడా పడటం విశేషం.