English | Telugu
రచ్చ గెలిచిన సూపర్ స్టార్ అల్లుడు
Updated : Jun 26, 2013
తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్ కు హిందీ అభిమానులతో పాటు, సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ధనుష్, సోనమ్ కపూర్ జంటగా నటించిన హిందీ చిత్రం "రాంఝాన". ఇది ధనుష్ కు తొలి హిందీ చిత్రం. ఇటీవలే విడుదలైనా ఈ చిత్రం మొదటి వారంలోనే 31.5 కోట్లు వసూలు చేయడంతో... బాలీవుడ్ మొత్తం ఒక్కసారి ఆశ్చర్యానికి గురైంది. దీంతో బాలీవుడ్ లో ధనుష్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇంతటి ఘన విజయం సాధిస్తున్న ఈ చిత్రంపై బాలీవుడ్ బిగ్-బి అమితాబ్ బచ్చన్ "ధనుష్ నటన అధ్బుతం. ఇపుడు బాలీవుడ్ మొత్తం ధనుష్ గురించే మాట్లాడుతున్నారని" ప్రశంసల జల్లు కురిపించారు. మొత్తానికి ధనుష్ తన మామ రజినీకాంత్ పేరు నిలబెట్టాడు.