English | Telugu
మ్యాంగోతో వస్తున్న రాజశేఖరుడు
Updated : Jun 26, 2013
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ లలో ఒకడిగా ఉండే అమ్మరాజశేఖర్, దర్శకుడిగా మారి "రణం" చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో మళ్ళీ "ఖతర్నాక్" అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత అమ్మ రాజశేఖర్ తీసిన చిత్రాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కొంత కాలం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అమ్మరాజశేఖర్ మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
కృష్ణుడు, యువన్ హీరోలుగా షమ్ము, అర్చన హీరోయిన్లుగా "మ్యాంగో" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.