English | Telugu
మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Updated : Jul 29, 2013
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ "మర్ద్" అనే మహిళల సంస్థను స్థాపించారు. అయితే ఈ సంస్థను తెలుగులో ప్రచారం చేయడానికి మహేష్ బాబు తన వాయిస్ ఇవ్వడానికి అంగీకరించాడు.
"సమాజంలో ఓ మంచి మార్పు కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు మహేష్ కు థాంక్స్ చెప్తున్న" అంటూ ఫర్హాన్ అక్తర్ ట్విట్టర్ ద్వారా మహేష్ కు కృతఙ్ఞతలు తెలిపాడు. ఆడవాళ్ళపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలకు కదిలిపోయిన ఫర్హాన్ అక్తర్ "మర్ద్" అనే సంస్థను ప్రారంభించారు. సమాజంలో ఆడవాళ్లకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి? వారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి? అనే విషయాల్లో మగవాళ్ళకు అవహగాహన కల్పించడమే ఈ "మర్ద్" యొక్క ముఖ్య ఉద్దేశం.
దీనికి సంబంధించి అక్తర్ పలు భాషల్లో పద్యాలూ రాయించి, పలువురు ప్రముఖుల చేత పాడించారు. అదే విధంగా తెలుగు పద్యానికి మహేష్ వాయిస్ అందించడమే కాకుండా, ఈ సంస్థకు తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చాడు. ఈ సంస్థకు మహేష్ వాయిస్ అందించిన తెలుగు పద్యం త్వరలోనే విడుదల కానుంది. ఈ సంస్థకు సంబంధించిన తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు.