English | Telugu

నితిన్ తో దిల్ రాజు కొత్త చిత్రం

"ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రాల విజయాలతో ఊపు మీదున్న హీరో నితిన్, తన తదుపరి చిత్రాలను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ఈ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "హార్ట్ ఎటాక్" చిత్రంలో నటించనున్నాడు. తర్వాత నితిన్ తన సొంత బ్యానర్ లో కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు నిర్మించనున్న ఓ చిత్రంలో నితిన్ నటించబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి "కలిసుంటే కలదు సుఖం" అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలిసింది. మరి ఈ చిత్రాలు నితిన్ కెరీర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి మరి.