English | Telugu

నేడే లెజెండ్ డాన్సులు విడుదల

బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న "లెజెండ్" పాటలు ఇటీవలే విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటల వీడియో ట్రైలర్ లను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలకు భారీ స్పందన వస్తుంది. వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నారు.