English | Telugu

వరుణ్ లాంటి మొగుడు కావాలంట...!

గోవా బ్యూటీ ఇలియానా మొన్నటివరకు షాహీద్ కపూర్ తో సీక్రెట్ రోమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు గతకొంత కాలంగా కాబోయే వరుడు కోసం ఎదురుచూస్తున్నదని వార్తలు కూడా వస్తున్నాయి. తనకు కాబోయే భర్త "మంచి లక్షణాలు ఉండాలి. అందగాడు, నన్ను బాగా చూసుకోవాలి" అంటూ పెద్ద లిస్టు చెప్పే ఇలియానా ఈసారి ఏకంగా నాకు ఈయనే కావాలని ధైర్యంగా చెప్పేసింది.

ఈ అమ్మడికి బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ భర్తగా కావాలని కోరుకుంటుంది. వీరిద్దరూ కలిసి "మై తేరా హీరో" అనే సినిమాలో నటించారు. ఇందులో చాలా హాట్ హాట్ లిప్ లాక్ సీన్ ఒకటి(సినిమాలో ఇంకెన్ని ఉన్నాయో తెలియదు)ఉంది. దీని గురించి ఇలియానా మాట్లాడుతూ... నేనిప్పటివరకూ రణబీర్ కపూర్, షాహీద్ కపూర్ లతో సినిమాలు చేశాను కానీ, వాళ్ళిద్దరితో కన్నా నాకు వరుణ్ తో మంచి అనుబంధం కుదిరింది. వరుణ్ బాగుంటాడు. మంచి పరిణితి గల వ్యక్తి. అనవసరంగా మాటలు మాట్లాడడు. టోటల్ గా చెప్పాలంటే తను "కంప్లీట్ మెన్". అందుకే నాకు వరుణ్ లాంటి భర్త కావాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చాలా రోమాన్స్ జరిగిందని వార్తలు వినిపించాయి. మరి ఇపుడు ఇలియానా మాటలు వింటుంటే వీరి మధ్య రోమాన్స్ చాలా దూరమే వెళ్లిందని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలియానా ఆశలపై వరుణ్ ఒక్కసారిగా నీళ్ళు చల్లినంత పనిచేసాడు. వరుణ్ మాత్రం "పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదు. కానీ కచ్చితంగా సినిమా హీరోయిన్ ను మాత్రం పెళ్ళాడను" అని చెప్పేసాడు. దాంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని తెలిసింది. చూద్దాం.. ఇలియానా రోమాన్స్ ఇంకెంత వరకు వెళుతుందో.