English | Telugu
పక్కా ప్లానింగ్ తో వస్తున్న శ్రీధర్
Updated : Jun 15, 2013
ఇ.వి.వి దర్శకత్వంలో వచ్చిన "ఎవడిగోల వాడిది" చిత్రంతో నిర్మాతగా పరిశ్రమలోకి అడుగెట్టిన లగడపాటి శ్రీధర్... ఆ తర్వాత "స్టైల్", "స్నేహ గీతం" వంటి చిత్రాలతో అభిరుచిగల మంచి నిర్మాతగా తెచ్చుకున్నారు. అయితే కొంత కాలం విరామం తీసుకున్న ఆయన వరుస చిత్రాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.
నిన్న లగడపాటి శ్రీదర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పత్రిక సమావేశంతో మాట్లాడుతూ.... వరుసగా ఎనిమిది చిత్రాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆ చిత్ర వివరాలు మీకోసం...
1. లింగుస్వామి_అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం.
2. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రం.
3. మంచు మనోజ్‌తో ఓ చిత్రం.
4. "పోటుగాడు" చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్న పవన్ దర్శకత్వంలో ఓ చిత్రం.
5. ప్రముఖ కెమెరామెన్ శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం.
6. "పోటుగాడు" చిత్రాన్ని తమిళంలో లారెన్స్ దర్శకత్వంలో రీమేక్.
7. కన్నడలో విజయం సాధించిన చిత్రాన్ని ఓ యువ దర్శకుడితో తెలుగులో రీమేక్.
8. ఓ యువ దర్శకుడితో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.